ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు లింగం.

 ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు  యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు లింగం. కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులుముఖ్యమంత్రి కెసిఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 20 లక్షల మంది  యువకులకు నిరుద్యోగ భృతి  ఇవ్వకుండా వారి బతుకులతో చెలగాటం ఆడుతున్నారని రాజాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు పాలెమెని లింగం ఆరోపించారు. శనివారంరాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడికి ముందే స్థానికంగా నాయకులను  పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగులకు బడ్జెట్ కేటాయించలేదని,  20 లక్షల మంది  నిరుద్యోగులు ప్రభుత్వానికి కనిపిస్త లేరా అని ప్రశ్నించారు.నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చే వరకూ ఎన్ని అరెస్టులు చేసినా అసెంబ్లీ ముట్టడి ఎవ్వరు ఆపలేరు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడిస్తాం రాష్ట్ర నాయకుల ఫోన్  ట్రాక్ చేస్తూ ముందస్తు అక్రమంగా అరెస్టు చేయడం జరిగిందని ఆరోపించారు. అరెస్ట్ ఆయన నాయకులలో యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు గొనెల రమేష్, మైనారిటీ సెల్ నసిర్ బేగ్,  సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మంగలి కృష్ణ, వాసు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ తఖీ  బాబా, ముస్తఫా,ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.