యోగవల్ల మానసిక పరిపక్వత,శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుంది-జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు...
యోగవల్ల మానసిక పరిపక్వత,శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుంది-జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు... అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని" పురస్కరించుకుని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలను వేశారు . యోగ వల్ల మానసిక పరిపక్వత రావటమే కాకుండా శారీరక ఆరోగ్యం వస్తుందని ,శరీరము, ఆత్మ, బుద్ధి వికసిస్తాయని,దీనివల్ల పనిచేసే సామర్థ్యం పెరుగుతుందని, అందువల్ల అందరూ యోగాను అలవాటు చేసుకోవాలని అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయుష్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గత 5,6 సంవత్సరాలుగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు .పతంజలి కాలం నాటి యోగాను మనం పూర్తిగా మర్చిపోయామని ,కానీ అనేక యూరోపియన్ దేశాలు,పాశ్చత్య దేశాలు యోగాను అభ్యసిస్తున్నాయని, లక్షలాదిమంది యోగా టీచర్లు యోగాను నేర్పిస్తున్నారని తెలిపారు.యోగ ప్రాముఖ్యతను గుర్తించిన అనేక కార్పొరేట్ సంస్థలు యోగాను తప్పనిసరి చేశాయని అన్నారు. రెవిన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డిఆర్ఓ కే .స్వర్ణలత, యోగా గురువు ఆంజనేయులు, అరుణజ్యోతి ,పలువురు జిల్లా అధికారులు ,జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏ ఓ, సిబ్బంది, తదితరులు హాజరయ్యారు.