యాదవులకు బడ్జెట్ కేటాయించినందుకు హర్షం
యాదవులకు బడ్జెట్ కేటాయించినందుకు హర్షం
అభివృద్ధికి కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్జీ మధుసూదన్ యాదవ్ శ్రీ కృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసిన ఘనత ఒక్క కేసీఆర్ కి దక్కుతుందని శ్రీ కృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జీ మధుసూదన్ యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ. గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు యాదవులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారు తప్ప ఏమీ అభివృద్ధి చేయలేదని ఆయన దుయ్యబట్టారు. యాదవుల పట్ల యాదవుల అభివృద్ధి పట్ల వారి క్షేమాలను వారి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో మూడు వేల కోట్ల రూపాయలను బడ్జెట్ను కేటాయించడం హర్షించదగ్గ విషయం అని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చదువుల పట్ల వారి అభివృద్ధి పట్ల గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేసిన ఘనత ఒక కేసీఆర్ ప్రభుత్వం దక్కిందని ఆయన పేర్కొన్నారు. శ్రీ కృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.ఫోటో రైట్ అప్: విలేకరులతో మాట్లాడుతున్న శ్రీ కృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్ మధుసూదన్ యాదవ్.