వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ని అడ్డుకున్న బీజేపీ నాయకులు...

 వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ని అడ్డుకున్న బీజేపీ నాయకులు...

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలి.చిన్న చింతకుంట  ప్రతి గ్రామంలో రైతు వేదిక భవనం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోటో అదేవిధంగా మంత్రి ఫోటోలు పెట్టడం జరిగిందని కానీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదు అనే ఉద్దేశంతో బిజెపి నాయకులు మంత్రి నిరంజన్ రెడ్డి అడ్డుకున్నారు. ఆదివారం మండల మండల కేంద్రంలో రైతు వేదిక ప్రారంభించడానికి  వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ని వారు అడ్డుకొని ప్రశ్నించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోలు ఎందుకు పెట్టలేదని మంత్రిని నిలదీశారు. ప్రతి గ్రామంలో రైతు బాగుండాలి అబ్బాయి ఫోటోలు పెడుతున్నారని ఒక చింతకుంట మండలం లోని ఎందుకు పెట్టలేదని మంత్రిని నిలదీసేందుకు వస్తున్న బిజెపి నాయకులను పోలీసులు ఎస్సై భాగ్య లక్ష్మి రెడ్డి సిబ్బందితో వారిని అరెస్టు చేశారు. ఇక్కడి న్యాయమని ప్రశ్నించినందుకు అరెస్టు చేస్తారా ఇది న్యాయమేనా అని బిజెపి నాయకులు కొంతసేపు నిరసన తెలిపారు. మంత్రిపై ఎమ్మెల్యేపై నినాదాలు చేశారు నినాదాలు చేశారు. అరెస్టయిన వారిలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు నందిరాజు, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు కురువ రమేష్ దశరథ్ మనోహర్ చంద్రన్న నరేంద్రజీ మహేష్ వీరితో పాటు తదితరులు అరెస్టు చేశారు.