రహదారి విస్తరణలో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలో రహదారికి ఇరువైపులా వేస్తున్న వృధా నీటి పైప్ లైన్ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేశించారు.

రహదారి విస్తరణలో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలో  రహదారికి ఇరువైపులా వేస్తున్న  వృధా నీటి పైప్ లైన్ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేశించారు.  శనివారం పట్టణంలోని  న్యూ టౌన్ చౌరస్తా వద్ద  వృధా నీటి పైప్లైన్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.   పైప్లైన్ వేసేందుకు జాప్యంపై కారణాలను ఆయన ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.  జాప్యం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మున్సిపల్ ఇంజనీర్లను ఆదేశించారు. అదేవిధంగా రహదారి విస్తరణలో తొలగించిన ఇండ్లు, షాపుల కి సంబంధించి వ్యర్థాలను ఎప్పటికప్పుడు తీసివేసి రహదారి మొత్తం శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. తొలగించిన శిథిలాలు రోడ్డుపైన లేదా  ఇండ్ల పక్కన ఉన్నట్లయితే రోడ్డుపై ప్రయాణించేవారి కి ఇబ్బందికరంగా ఉంటుందని అన్నారు. 

 మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, మున్సిపల్ ఇంజనీర్ బెంజమిన్, ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.