ఓటర్ లిస్ట్ జాబితా లో అడ్రసులు సరిచేసుకోండి... ఎంపిడిఓ రాఘవ... .
ఓటర్ లిస్ట్ జాబితా లో అడ్రసులు సరిచేసుకోండి........... మండలంలో అకస్మికంగా వార్డ్ నెంబర్ ఖాళీ అయిన స్థానాలలో ఎన్నికలు జరుగుతాయి వెంటనే ఓటర్ లిస్ట్ లో అభ్యర్థుల అడ్రస్ తప్పుగా ఉంటే వెంటనే సరిచేసుకోవాలని ఎంపిడిఓ రాఘవ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ, ఈ నెల 8 వరకు ఓటర్ లిస్ట్ జాబితా లో అడ్రస్ సరిగా లేని వారు వెంటనే పంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలని కోరారు. అదేవిధంగా మండలంలో ఉన్న బూరుగుపల్లి 3 వార్డు, గార్లపాడు 7 వార్డు, ఇబ్రహీంనగర్ 9, సోమ్లా నాయక్ తండా 2 కోయిలకొండ 7, హనుమాన్ గడ్డ తండా 4, సూరారం 9 ఆకస్మికంగా ఖాళీ అయిన వార్డ్ మెంబర్ స్థానాలు భర్తీ చేయడానికి ఎన్నికలు జరుగుతాయని తెలియజేశారు. ఎన్నికల జరిగే వార్డు లో నివాసం ఉండి , వేరే వార్డు లో అడ్రస్ తప్పుగా పడితే వెంటనే సరిచేసుకోవాలని ఎంపీడీవో కోరారు.