విత్తన దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు....రూ : 70వేల విలువగల విత్తనాలు సీజ్...
విత్తన దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు....రూ : 70వేల విలువగల విత్తనాలు సీజ్...
జడ్చర్ల రూరల్ , మండల పరిధిలోని పెద్ద ఆదిరాల గ్రామంలో లోగల విత్తన దుకాణాల్లో జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ టీం గురువారం తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా టీం సభ్యులు విత్తన దుకాణాల్లో రికార్డులను,వాటిలో విక్రయిస్తున్న విత్తనాలను పరిశీలించారు. మల్లికార్జున సీడ్స్, అన్నదాత అన్నదాత సీడ్స్ లో కాలపరిమితి చెందిన విత్తనాలను అమ్మడం గుర్తించిన టాస్క్ ఫోర్స్ అధికారులు సుమారు 70 వేల రూపాయల విలువగల ఆ విత్తనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోస పోకూడదని, ఎవరైనా అలాంటి విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని తెలిపారు. అంతేకాక నకిలీ విత్తనాలు అమ్మే ప్రయత్నం చేసే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.