విజయోత్సవ ర్యాలీలు నిషేధం...ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు..

విజయోత్సవ ర్యాలీలు నిషేధం...ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు..రావిరాల వేంకటేశ్వర్లు ఎస్.పి.జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా విశేష స్థాయిలో ప్రజల సహకారం లభించడం అభినందనీయం. అదేవిధంగా రేపు సోమవారం, మూడవ తేదీన జరుగబోయే ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రజలు ప్రశాంతంగా ఉంటూ ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీసుకు సహకరించాలి. ఓట్ల లెక్కింపు అనంతరం ఊరేగింపులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి లేదు. గౌరవ హై కోర్టు మరియు ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు జడ్చర్లలో విజయోత్సవ ర్యాలీలతో సహా ఇతర ఊరేగింపులకు అనుమతి ఇవ్వబడదు. న్యాయస్థానం, ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాలననుసరించి ర్యాలీల నిషేధంపై ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వడం జరుగుతున్నది. ఈ విషయంలో చట్టవిరుద్దంగా ప్రవర్తించేవారిపై జాతీయ విపత్తు చట్టం మరియు ఎన్నికల నియమావళి చట్టం మేరకు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ మీ పోలీసుకు సహకరించాలని విజ్ఞప్తి. చట్టాలను ఉల్లంఘించేవారిపై నిఘా పెట్టడానికిగానూ వీడియో కెమెరాలతో పాటుగా నిఘా బృందాలు ఉంటాయి. ఎన్నికల చట్టాలు కఠినంగా ఉండే విషయం అందరికీ తెలిసిందేనని, అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవద్దని ప్రజలకు తెలియజేయమైనది