విద్యాసంస్థలను ప్రారంభించండి.....డీఈఓ ఆఫీస్ ముందు ధర్నా...
విద్యాసంస్థలను ప్రారంభించండి.....డీఈఓ ఆఫీస్ ముందు ధర్నా....రాష్ట్రంలో కరోనా పేరుతో విద్యాసంస్థలు మూసివేయడం సరైనది కాదని ఎస్ఎఫ్ఐ.ఏఐఎస్ఎఫ్.పిడిఎస్యు.ఎన్ఎస్యుఐ .బీసీ సంఘం .మరియు పాలమూరు జేఏసీ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ,దేశంలో తెలంగాణ రాష్ట్రం అక్షరాస్యత 23 శాతం ఉందని పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానం ఉందని అన్నారు ప్రతి విద్యా సంస్థలు మరియు మాస్కులు ఉచితంగా ప్రభుత్వమే అందించి విద్యా సంస్థలను ప్రారంభించాలని అన్నారు. అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు డీఈఓ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చామని అన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో నడుస్తున్న సినిమా హాల్లో.పార్కులు. పబ్బులకు లేని కరోనా మరియు విద్యాసంస్థలపై ఎలా ఉంటుందని వారు ప్రభుత్వాన్ని విమర్శించారు.విద్యార్థులను మోసం చేస్తే సహించేది లేదని వారు ప్రభుత్వాన్ని అన్నారు.ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర నాయకులు రమేష్ మాట్లాడుతూ,ఎమ్మెల్సీ ఎన్నికల కన్నా ముందు విద్యాసంస్థలు ప్రారంభించి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విద్యాసంవత్సరం మూసి వేయడం సరైన పద్ధతి కాదని అన్నారు.9వ తరగతి నుంచి పెద్ద చదువులు కొనసాగించాలని వారు అన్నారు.పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ విద్యాసంస్థల్లో హాస్టల్ లో ఉండే ప్రభుత్వ విద్యార్థుల చదువుకు దూరం అవుతున్నారని తెలిపారు.హాస్టల్లో కంటోన్మెంట్ రూములు ఏర్పాటు చేసి కరోనా ఉన్న విద్యార్థులను అందులో ఉంచాలన్నారు.జేఏసీ నాయకులు లక్ష్మణ్ మాట్లాడుతూ యూనివర్సిటీ హాస్టల్ లో మరియు కళాశాల హాస్టల్ లో ప్రారంభించి.విద్యార్థులు జీవితాలకు ప్రభుత్వం అండగా నిలవాలని వారు ఉన్నారు.మరియు కార్పొరేట్ మరియు ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం తొత్తు గా మారిందని అన్నారు . కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థుల దగ్గర దాదాపు 70 శాతం ఫీజు వసూలు చేశారని అన్నారు. జి వి ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు పేద విద్యార్థులు ప్రభుత్వ మరియు కళాశాల చదువుతున్నారు.ఇప్పటికే చాలా మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో విద్యను కోల్పోయారని వారు తెలిపారు.తక్షణమే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు ప్రారంభించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.ఈ కార్యక్రమంలో లో SFI. AISF. PDSU GVS. JAC. NSUI నాయకులు పాల్గొన్నారు.