విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించే బాధ్యత గురువులదైతే వారు చదువుకునేందుకు నాణ్యమైన భవనాలను నిర్మించాల్సిన బాధ్యత ఇంజనీర్ల పై ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.

 విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించే  బాధ్యత  గురువులదైతే వారు చదువుకునేందుకు నాణ్యమైన భవనాలను నిర్మించాల్సిన  బాధ్యత ఇంజనీర్ల పై ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.  బుధవారం భూత్పూర్ మండలం అన్నాసాగర్ లో 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మండల పరిషత్తు ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పాఠశాలలో 25 లక్షల రూపాయలు వెచ్చించి అదనంగా మూడు గదులను నిర్మించగా, కొత్త భవనం నిర్మాణం నాణ్యతను కలెక్టర్ తనిఖీ చేస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా కొత్తగా నిర్మించిన తరగతి గదులలో ఫ్యాన్ లతోపాటు, లైట్ లు, బ్లాక్ బోర్డులు ఏర్పాటు చేయడమే కాకుండా పెయింటింగ్ అన్ని పూర్తి చేయడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు టాయిలెట్ సౌకర్యం గురించి జిల్లా కలెక్టర్ ను కోరగా పరిశీలిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంట భూత్పూర్ తాసిల్దార్  చేన్నకిష్టన్న, డి ఈ రాములు ఉన్నారు .