విద్యారంగానికి పెద్దపీట వేసిన తెరాస ప్రభుత్వం...జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి..

విద్యారంగానికి పెద్దపీట వేసిన తెరాస ప్రభుత్వం...జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి.. జడ్చర్ల మండల పరిధిలోని కొడ్గల్ గ్రామంలో ₹ 4.20 కోట్లతో  తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే గౌ శ్రీ డాక్టర్ సి లక్ష్మారెడ్డి .తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధితో పాటు, సంక్షేమ పథకాలతో పాటు విద్యారంగానికి కూడా పెద్ద పీట వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్కె చెల్లుతుంది అని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి  అన్నారు. మండల పరిధిలోని కొడ్గల్ గ్రామంలో ₹ 4.20 కోట్లతో మంజూరు అయిన గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికల) భవన నిర్మాణానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన నిరుపేద విద్యార్థుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ఆలోచలనలతో రూపుదిద్దుకున్నవే ఈ గురుకుల పాఠశాలలని, ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థి చదువు కోసం ప్రభుత్వం ₹ 1.20 లక్షలను ఖర్చు చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత గడిచిన 7 సంవత్సరలలో కొన్ని వందల గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు. నిరుపేద కుటుంబాల్లోని పెద విద్యార్థుల ఉన్నత చదువులు చదవడమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి  అన్నారు.