వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే...

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే... 
జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గురువారం ప్రారంభించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  ప్రభుత్వ నియంత్రణలో   క్రయవిక్రయాలు జరిపేందుకు

 ఈ కొనుగోలు కేంద్రం ద్వారా వీలుంటుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వెల్లడించారు. పండించిన ధాన్యాన్ని రైతులు ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకుని లాభం పొందాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ నాయకులు, అధికారులు  ఉన్నారు.