వరిపంట కొనుగోళ్లు ప్రారంభించాలని కోరుతున్న రైతులు... 2,3 రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నా రైతుబంధు అధ్యక్షులు నర్సిములు...
వరిపంట కొనుగోళ్లు ప్రారంభించాలని కోరుతున్న రైతులు...
2,3 రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నా రైతుబంధు అధ్యక్షులు నర్సిములు...
రాజాపూర్ మండల పరిధిలోని దాదాపు అన్ని గ్రామంలో ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసినందున, భూగర్భజలాలు పెరగటంతోపాటు, చెరువులు, కుంటలు, వాగులు, జలకలతో నిండటంతో, గ్రామంలో ఉన్న అధిక భూభాగంలో నీటిశాతం పెరగటంవల్ల, రైతన్నలు ఈ సంవత్సరం అధిక సంఖ్యలో వరిపంటను సాగుచేశారు.కష్టపడి రైతన్న పండించిన వరిపంటలు ఇప్పుడు కోతకు రావటంతో అందరూ రైతులు వారివారి పొలాల్లో పండించిన వరిధాన్యాన్ని అమ్ముకోవడం కోసం ఎదురుచూస్తున్నారు.ఈద్గాన్ పల్లి గ్రామంలోపోయిన సంవత్సరం పండించిన వరి ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం నేరుగా ఈగ్రామాల్లోనే IKP & సెర్పు అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి వరి ధాన్యం కొనుగోలు చేశారు. మరీ ఈ సంవత్సరం ప్రస్తుత పరిస్థితుల్లో ఈద్గాన్ పల్లి గ్రామంలోని వరిపంటను పండించిన రైతుల నుంచి వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికైనా వరి కొనుగోలు చేయాలని ఆ గ్రామ రైతులు కోరుతున్నారు.ఈ విషయమై రైతుబంధు మండల అధ్యక్షులు అన్మగల్ల నర్సింలును వివరణ కోరగా.మండలంలోని డీసీఎంఎస్ ఆధ్వర్యంలో రాజాపూర్, సిఎస్ పిఎస్, ఆధ్వర్యంలో తిర్మలాపూర్, ఐకేపీ ఆధ్వర్యంలో ఇద్గానిపల్లి, రంగారెడ్డి గూడ, కల్లేపల్లి గ్రామాలలో రాబోవు రెండు మూడు రోజుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఎక్కడ కూడా రైతులు ఇంకా పూర్తిస్థాయిలో పంట కోతకు రాలేదని ముందుగా ఎవరైనా ఒకరిద్దరు కతకోసినవారు ఉన్న వారు ధాన్యాన్ని పూర్తిగా శుభ్రంచేసి, తేమ 14% శాతం కంటే తక్కువ ఉండేటట్లు చూసుకోవాలని రైతుబంధు అధ్యక్షుడు అన్మ గల్ల నర్సింలు పేర్కొన్నారు.