వరి ధాన్యం తేమ 17 శాతం ఉండాలి.... ఏడిఏ వెంకటేశ్వర్లు....

వరి ధాన్యం తేమ 17 శాతం ఉండాలి.... ఏడిఏ వెంకటేశ్వర్లు....                                          వరి కొనుగోలు కేంద్రాలకు తెచ్చే రైతుల వరి ధాన్యం తేమ 17 శాతం ఉండాలని ఏడిఏ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉన్న ఎంపీడీవో కార్యాలయంలో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్ పి టి సి విజయ భాస్కర్ రెడ్డి, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఏ డి ఏ మాట్లాడుతూ,  ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవడం జరుగుతుందని తెలియజేశారు. రైతులు రైస్ మిల్లులకు తీసుక వెళ్లకుండా, వరి కొనుగోలు కేంద్రాలకు  ధాన్యాన్ని తీసుకు రావాలని కోరారు. నాణ్యమైన వరి ధాన్యానికి  ఏ గ్రేడ్ గా గుర్తించి మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని తెలియజేశారు. మండలంలో ఉన్న రైతులు వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు . ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ప్రకాష్, రాఘవ, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ , మండల ఏ ఈ ఓ లు కొండారెడ్డి , వరలక్ష్మి , ప్రశాంత్ , వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.