వరిధాన్యం రవాణాకు లారీ ఓనర్స్ సహకరించాలి.....

 వరిధాన్యం రవాణాకు లారీ ఓనర్స్ సహకరించాలి.....

మహబూబ్ నగర్ టౌన్ మేజర్ న్యూస్:- లారీ అసోసియేషన్ ఓనర్స్ తో శుక్రవారం నాడు ఆర్టిఓ ఆఫీసు ప్రాంగణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి  సమావేశం ఏర్పాటు చేశారు.  శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ,రబీ సీజన్లో పండించే వరి ధాన్యమును వరి కొనుగోలు  కేంద్రాలకు తరలించడానికి సహకరించాలి అన్నారు. రాష్ట్రంలో పండించిన బియ్యమును ఇతర రాష్ట్రాలకు రవాణా చేసేటప్పుడు ఎక్కువ లారీలు అవసరమైనప్పుడు అసోసియేషన్ సహకరించాలని  తెలియజేశారు. మానవతా దృక్పథంతో రైతులకు అండగా నిలవాలని  లారీ అసోసియేషన్ సభ్యులను కోరారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ సానుకూలంగా స్పందించారని ఎంవీఐ శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు.