వాల్యా నాయక్ జన్మదినం సందర్భంగా పండ్లు పంపిణీ...
వాల్యా నాయక్ జన్మదినం సందర్భంగా పండ్లు పంపిణీ
టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రామావత్ వాల్య నాయక్ జన్మ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేదలకు, రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అంతకుముందు మండల టిఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధుల సమక్షంలో వాలే నాయక్ కేక్ కట్ చేసి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. అలాగే మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా వాలే నాయక్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వెంకటాచారి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, గోపాల్ రెడ్డి, ఎంపీటీసీ లింగు నాయక్, అరుణ్ కుమార్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.