అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన MLA ఆల వెంకటేశ్వర్ రెడ్డి......
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన MLA ఆల వెంకటేశ్వర్ రెడ్డి......భూత్పూర్ మండలం పరిధిలోని అన్నసాగర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ కాలనీలో శుక్రవారం అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణానికి దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ "డబల్ బెడ్ రూమ్ కాలనీలో లబ్ధిదారులు అందరు కూడా ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కరోనా వైరస్ కి సంబంధించిన తగు జాగ్రత్తలు పాటిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్లకూడదని, బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే మాస్కులు ధరించి,
భౌతిక దూరం పాటించి , చేతులకి శానిటైజర్ చేసుకోవాలి అని వారికి సూచించారు . డబల్ బెడ్ రూమ్ కాలనీ నీ శుభ్రంగా ఉంచుకోవాలని ,మురికి నీరు నిల్వ ఉంచకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాలను కాపాడుకోవాలని ,తగు జాగ్రత్తలు పాటించాలని వారు కాలనీ వాసులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీలిమ నరసింహులు, ఉప సర్పంచ్ రాజారెడ్డి, కోఆప్షన్ మేంబర్ కాజా ,ఎంపీటీసీ రజిత శేఖర్, వార్డు మెంబర్ టిఆర్ఎస్ అధ్యక్షులు బోయ చెన్నయ్య మరియు సాకీర్ వెంకట్ రాములు, వడ్డే లక్ష్మయ్యలు
మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.