ఉమ్మడి రాష్ట్ర మాజీమంత్రి మహమ్మద్ జానీ కన్నుమూత....

ఉమ్మడి రాష్ట్ర మాజీమంత్రి మహమ్మద్ జానీ కన్నుమూత....

సంతాపం ప్రకటించిన టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సాదిక్...ఉమ్మడి రాష్ట్ర మాజీమంత్రి మహ్మద్ జానీ (73 ) మృతి చెందడం బాధాకరమని వారి కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సాదిక్ ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో మహమ్మద్ జానీ మాజి మంత్రిగా ప్రముఖ మైనారిటీ నాయకునిగా  రాష్ట్రానికి తన సేవలను అందించి గుండెపోటుతో శనివారం సాయంత్రం మృతి చెందడం బాధాకరమని సాదిక్ ఈ సంధర్బంగా అయన సేవలను కొనియాడారు. మహ్మద్ జానీ ఉమ్మడి రాష్ట్రంలో గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.మంత్రిగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా పనిచేశారని సాదిక్ కొనియాడారు.మంత్రిగా పని చేసే రోజుల్లో మైనారిటీ వర్గాలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయానదని తెలిపారు. మైనారిటీ ల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఒక గొప్ప మైనారిటీ నాయకొన్ని రాష్ట్రం కోల్పోయిందని బాధను వ్యక్తం చేశారు.ఆయన మృతి ఉమ్మడి రాష్ట్రానికి బాధాకరమని వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్త పరుస్తూ మంత్రి పవిత్ర రంజాన్ మాసంలో మృతి చెందడం ఇస్లామిక్ సంప్రదాయంలో మంచి కార్యమని గుర్తు చేస్తూ  దేవుడు వారికి స్వర్గం ప్రాప్తం చేయాలని ప్రార్థించారు..