పెద్దమునగల్ చెడు గ్రామం లో వ్యక్తి అనుమానాస్పద మృతి
అడ్డాకుల గ్రామ పొలిమేర ప్రాంతంలో వెలసిన స్ప్రింగ్ సోలార్ కంపెనీ లో కొద్ది నెలల నుండి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మండల పరిధిలోని పెద్దమునగల్ చెడు గ్రామానికి చెందిన ఎరుకల వెంకటస్వామి విధుల్లో భాగంగా తాగునీరు తీసుకెళ్లడానికి సోలార్ కంపెనీ దగ్గరలో ఉన్న పెట్రోల్ పంపు పక్కన ఉన్న దివ్య టిఫిన్ సెంటర్ దగ్గర శుక్రవారం ఉదయం ఆకస్మికగా మృతి చెందడం జరిగింది. సోలార్ కంపెనీ యాజమాన్యం విధుల్లో కఠినంగా వ్యవహరిస్తున్నారనే అనుమానంతో డ్యూటీ ఒత్తిడికి లోనై మానసికంగా క్రుంగి చనిపోయినట్లు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. మృతునికి భార్య నలుగురు ఆడపిల్లలు ఉన్నట్లు సమాచారం మృతుని కుటుంబ సభ్యులు చనిపోయిన స్థలాన్ని చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.