ఉగ్రవాది అరెస్ట్-రూ. 60 కోట్ల హెరాయిన్ స్వాధీనం

ఉగ్రవాది అరెస్ట్-రూ.  60 కోట్ల హెరాయిన్ స్వాధీనం జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాద ముఠాకు చెందిన వ్యక్తి నుంచి రూ.60 కోట్లు విలువైన హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పక్కా సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు.. పాకిస్థాన్​ అండతో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తోన్న ముష్కరుణ్ని అదుపులోకి తీసుకున్నారు.
జమ్ముకశ్మీర్​ కుప్వారా జిల్లాలోని కర్నా ప్రాంతంలో ఉగ్రవాద ముఠాకు చెందిన వ్యక్తి నుంచి తొమ్మిది కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్​లో రూ.60 కోట్లు ఉంటుందని తెలిపారు. ముర్తార్ హుస్సేన్ షా అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు.. ముఠాలో మరికొందరు పరారీలో ఉన్నారని తెలిపారు. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని వివరించారు.