ఉద్యోగస్తులకు తీపికబురు ను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం....

 ఉద్యోగస్తులకు తీపికబురు ను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం....                     ప్రభుత్వం ఉద్యోగులకు 30 శాతం పి ఆర్ సి ని ప్రకటించినందుకు కోయిలకొండ  మండలంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు ఆనందం వ్యక్తం చేస్తూ , స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా మండలంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఉద్యోగులకు అండగా నిలబడి ఆదుకోవడం జరిగిందని తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ ముఖ్యమంత్రి కి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పాండు, ఎంపిడిఓ రాఘవ, ఎంఈఓ లక్ష్మణ్ నాయక్, సీనియర్ అసిస్టెంట్లు హరిచంద్ర రెడ్డి, అహ్మద్  ఆర్ఐ కర్ణమయ్య, వీఆర్వోలు వీఆర్ఏలు, తదితరులు పాల్గొన్నారు