ఉదారత చాటుకున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి...
ఉదారత చాటుకున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి... భూత్పూర్ లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి తన ఉదారతను చాటుకున్నారు దేవరకద్ర నియోజక వర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి .అమిస్తాపూర్ లో డాక్టర్.అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వెళ్తుండగా అదే సమయంలో భూత్పూర్ ఎంపీడీవో కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే తన వాహనాన్ని ఆపిన ఎమ్మెల్యే... తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులను స్థానిక పంచవటి ఆస్పత్రికి తరలించారు... అనంతరం వైద్యులతో ఫోన్ లో మాట్లాడి యువకులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భూత్ పూర్ మున్సిపాలిటీ ఛైర్మెన్ బస్వరాజ్ గౌడ్, వైస్ చైర్మన్ కెంద్యాల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.