ఉచిత బియ్యంను సద్వినియోగం చేసుకోండి...ఎంపీటీసీ సభ్యులు అభిమన్యు రెడ్డి

ఉచిత బియ్యంను సద్వినియోగం చేసుకోండి...ఎంపీటీసీ సభ్యులు అభిమన్యు రెడ్డి .లాక్ డౌన్ లో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న  పేద ప్రజల పరిస్థితిని అర్థం చేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కడుపు నింపాలన్న సదుద్దేశంతో  15 కిలోల ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని దొండ్లపల్లి ఎంపీటీసీ సభ్యులు చించోడు అభిమన్యు రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాజాపూర్ మండల పరిధిలోని ఉమ్మడి దొండ్లపల్లి ఎంపీటీసీ పరిధిలోని గ్రామాలలో 15 కిలోల ఉచిత బియ్యం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కరోనా లాంటి క్లిష్టపరిస్థితుల్లో  ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సంబంధిత డీలర్ షాప్ లో బియ్యాన్ని  తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు శ్రీనివాస్, మంచాల కృష్ణయ్య, సేవ్యనాయక్, ఉపసర్పంచ్లు ప్రియాంక చిరంజీవి, కాశన్న, రాజునాయక్, వార్డు మెంబెర్స్, పంచాయతీ కార్యదర్శిలు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, యువసేన నాయకులు, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు.