రాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకు త్వరలోనే జిల్లాలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులను ఇస్తాం ...మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ...
రాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకు త్వరలోనే జిల్లాలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులను ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కరోన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కార్డు ఉన్న ప్రతి మనిషికి 15 కిలోల బియాన్ని రెండు నెలల పాటు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. 2014 ముందు జిల్లాలో కేవలం 4000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండేదని, అది ప్రస్తుతం 2 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకున్నదని, తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించామని అన్నారు. పేద ప్రజలందరికీ రెండు వేల రూపాయల పెన్షన్ తో పాటు, ఇంకా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని,జిల్లాను అన్నిరకాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు.ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కరోనా రోగులకు ఉచిత వైద్యం అందిస్తున్నామని,భోజనం కూడా పెడుతున్నామన్నారు.మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం, వ్యవసాయం, విద్య వంటి అన్ని రంగాలలో ప్రత్యేక చొరవతో కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, ఆర్డిఓ పద్మశ్రీ, డిఎస్ ఓ వనజాత తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.