తొలితరం దళిత నేత డా: జగ్జీవన్ రామ్ 114 వ జయంతి......

 తొలితరం దళిత నేత డా: జగ్జీవన్ రామ్ 114 వ జయంతి......

 తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆద్వర్యంలో జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్భంగా పట్టణ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టి పి ఎస్ కె జిల్లా కన్వీనర్ వి.కురుమూర్తి మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం 16 ప్రభుత్వ రంగ సంస్థలను  ఆధాని,అంబానీ కార్పోరేట్ శక్తులకు అమ్మి వేయడం వలన దళితులు,గిరిజనులు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం పోయి  తీరనినష్టం వాటిల్లుతుందని అన్నారు. పార్లమెంట్ లో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు అలంకరించి రిజర్వేషన్లు రక్షించారు. ఆయన దళిత, గిరిజన బాంధవుడు అని కొనియాడారు. ఆయనకు నివాళులు అర్పించడం అంటే  రిజర్వేషన్లు మనమంతా ఐక్యంగా పోరాడి నిలబెట్టడమే అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్. కురుమూర్తి,ఖమరలి,శ్రీకాంత్,కుర్మయ్య,ఆంజనేయులు,రాములు తదితరులు పాల్గొన్నారు.