టోక్యో ఒలింపిక్స్- 2020 సెల్ఫీ పాయింట్ ను ప్రారంభించిన మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్....

ఓలంపిక్ క్రీడలపై ప్రజలకు, క్రీడాకారులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోక్యో ఒలింపిక్స్- 2020 సెల్ఫీ పాయింట్ ను రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు,సాంస్కృతిక,పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ గురువారం ప్రారంభించారు.  ఈనెల 31 నుండి టోక్యో లో ప్రారంభం కానున్న ఒలింపిక్ క్రీడలకు పై అవగాహన సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఈ సెల్ఫీ పాయింట్ లను ఏర్పాటు చేస్తున్నారు.  టోక్యో లో నిర్వహించనున్న ఒలంపిక్ క్రీడలకు భారతదేశం నుండి 93 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, 53 మంది బాలురు, 40 మంది బాలికలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ముఖ్యంగా బాక్సింగ్ ,టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్ వంటి 14 క్రీడల్లో క్రీడాకారులు పాల్గొంటున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు .