తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు జయంతి.......

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు జయంతి.......నందిమల్ల. అశోక్ మాజీ టి.డి.పి అధ్యక్షులు.  ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జగ్జీవన్ రావు జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పార్లమెంట్ అధ్యక్షుడు బి.రాములు,నందిమల్ల.అశోక్ మాట్లాడుతూ 27 ఏండ్ల పిన్న వయసులో ఎం.ఎల్.సి గా ఎన్నికై 33 ఏండ్లు కేంద్ర మంత్రిగా సేవలు అందించిన దళిత జాతి ముద్దుబిడ్డ జగ్జీవన్ రావ్ అని కొనియాడారు.ఆయన వ్యవసాయ, రక్షణ,రైల్వే,మంత్రిగా హరిత విప్లవం తెచ్చి దేశములో వ్యవసాయ గిడ్డంగులు ఏర్పాటు చేశారు.బ్రిటిష్ రైల్వే ను ప్రక్షాళన చేసి రైల్వే పై ముద్ర వేసిన ఘనత ఆయనది అన్నారు.ఆయన రాజకీయ నాయకుడే కాదు గొప్ప సాహితీవేత్త,సమాజ సేవకుడు.దళిత జాతిలో పుట్టి దేశ అత్యున్నత స్థాయి ఉప రాష్ట్ర పతిగా సేవలు అందించిన మహనీయులు అన్నారు.ఆయన కుమార్తె మీరా కుమారి  కేంద్రమంత్రిగా, లోక్ సభా స్పీకర్ గా సేవలు అందించారు.జగ్జీవన్ గారి స్పూర్తితో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం.డి.దస్తగిరి,ఎం.డి.గౌస్,ఆవుల.శ్రీను,కె.బాలరాం,వహీద్,ఎం.బాలు,డి.బాలరాజు,కె.గోపాల్ పాల్గొన్నారు.