తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్
తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ -TVVU. నవాబుపేట మండల సమావేశం స్థానిక ఉర్దూ మీడియం పాఠశాల ఆవరణలో జరిగినది ఈ యొక్క కార్యక్రమానికి 20 గ్రామాల నుండి 30 మంది మండల స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో..........చర్చించిన విషయాలు
1. వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ నవాబుపేట మండల నూతన కమిటీ ఏర్పాటు 2. స్థానిక సంఘాల బలోపేతం - గ్రామాల్లోని సమస్యల పై చర్చ
3. 20 గ్రామాల స్థానిక సంఘాల కు TVVU మెడికల్ కిడ్స్ పంపిణీ చేయడం గూర్చి.
ఉదయము 11:00 గంటలకు ఈ యొక్క సమావేశం ప్రారంభమైనది ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లె పాగా శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. వివిధ గ్రామాల్లోని భూమి మరియు ఉపాధి హామీ సమస్యలపై చర్చ జరిగినది . తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ ,రంగారెడ్డి,నారాయణపేట,వికారాబాద్ జిల్లాల్లో 120 గ్రామాలకు మెడికల్ కిడ్స్ పల్స్ ఆక్స్ మీటర్స్ , డిజిటల్ ధర్మ మీటర్స్ , మాస్కులు, మెడిసిన్ పంపిణీ చేయనున్నట్లు వివరించారు అనంతరం మండల నూతన కార్యవర్గ కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది.
1.అధ్యక్షులు :గడ్డమీది అంబేద్కర్
2.ఉపాధ్యక్షులు : కె అంజమ్మ , బి కృష్ణయ్య
3.ప్రధాన కార్యదర్శి : V కిషన్ నాయక్
4. సహాయ కార్యదర్శులు : డి శ్రీనివాసులు ,జె. కలమ్మ
5. కోశాధికారి : టీ. అమృత
6. సలహాదారులు : బాలకిష్టయ్య గౌడ్ ,M యాదమ్మ ,
M. నర్సింహులు , లక్ష్మీ బాయి.ఈ కార్యక్రమంలో... TVVU రాష్ట్రప్రధాన కార్యదర్శి మట్టగళ్ళ వెంకటయ్య ఉపాధ్యక్షురాలు శ్రీమతి ఎం విజయలక్ష్మి , రాష్ట్ర మహిళా కార్యదర్శి డి వెంకటేశ్వరమ్మ మండల కో ఆర్డినేటర్ తిమ్మ గళ్ళ మునిష్ , P భువనేశ్వరి సంఘాల సభ్యులు యాదయ్య , బాలయ్య, మంజుల,లక్ష్మీదేవి , యం బాల్రాజ్ మొదలగు వారు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమం సాయంత్రం 4:00 గంటలకు అల్పాహారంతో ముగిసినది.