తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్...

తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్... ఆగస్టు6 ,1934-జూన్ 21, 2011 వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపెట్ గ్రామంలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమనికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారి గా జీవించారు. ఆర్థికశాస్త్రంలో PHD పట్టా పొంది ప్రిన్సిపాల్ గా ,రిజిస్ట్రార్ గా పని చెసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు.1969 తెలంగాణ ఉద్యమంలో అంతకు ముందు నాన్ ముల్కీ ,సాంబార్ ఇడ్లి గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ ,ఆంధ్ర రాష్ట్రల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954 లో పజల్ అలీ కమిషన్కు నివేదిక ఇచ్చాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాశాడు. తెలంగాణలొనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశాడు. తన ఆస్తిని, జీవితాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అంకితం చేశాడు.ఇప్పుడు నాకు ఒక కోరిక మిగిలింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలి. తర్వాత మరణించాలి. తుది శ్వాస2011 జూన్21 న విడిచారు. కార్యక్రమంలో గండీడ్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, అంబేద్కర్ సంఘం గ్రామ అధ్యక్షుడు మహమ్మదబాద్ వేణు, ఆగేర్ల వెంకటయ్య, కర్రె శంకరయ్య,వెంకటయ్య, కిష్టయ్య, రాజు, రాములు, కుమార్,బచ్చయ్య, రామకృష్ణ,రాఘవులు రాథోడ్,శివ,జ్యోతి,సుశాంత్ తదితరులు పాల్గొన్నారు