తెలంగాణలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు......!
తెలంగాణలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు......!
హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ ఈ ఏడాదిలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 70,280 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 431 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,04,298కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న కొవిడ్‌తో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1676కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 228 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,99,270కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,352 ఉండగా.. వీరిలో 1,395 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 111 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 97,89,113కి చేరింది.