తెలంగాణ చౌరస్తా, ఆర్ అండ్ బి, మెట్టుగడ్డ ప్రాంతాలలో లాక్ డౌన్ పరిస్థితులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు
శనివారం రాత్రి 8:15 గంటల ప్రాంతంలో మహబూబ్ నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా, ఆర్ అండ్ బి, మెట్టుగడ్డ ప్రాంతాలలో లాక్ డౌన్ పరిస్థితులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు. లాక్ డౌన్ సమయంలో క్రమశిక్షణ పాటించాలని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి . 16 గంటల పాటు సమర్థవంతంగా,క్రమ పద్ధతిలో లాక్ డౌన్ ను అమలు చేయడంలో జిల్లా ఎస్ పి ఆధ్వర్యంలో పోలీసుల పనితీరును అభినందించిన జిల్లా కలెక్టర్. ఎవరైనా తప్పుడు గుర్తింపు కార్డులు చూపించినట్లయితే కఠినమైన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు వీలైతే శుభ కార్యాలు వాయిదా వేసుకోవాలని,లేదా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అతికొద్ది మందితో నిర్వహించుకోవాలని సూచించారు.