తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ వారు హైదరాబాదులోని బోడుప్పల్ లో మార్చి 30, 31 ఏప్రిల్ 1 మరియు 2వ తేదీలలో నిర్వహిస్తున్న టువంటి 67వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల మరియు మహిళల కబడ్డీ పోటీలకు గాను ఆదివారం నాడు, మహబూబ్ నగర్ జిల్లా పురుషుల మరియు మహిళల కబడ్డీ

 తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ వారు  హైదరాబాదులోని బోడుప్పల్ లో మార్చి 30, 31 ఏప్రిల్ 1 మరియు 2వ  తేదీలలో  నిర్వహిస్తున్న టువంటి 67వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల మరియు మహిళల కబడ్డీ  పోటీలకు గాను ఆదివారం నాడు, మహబూబ్ నగర్ జిల్లా పురుషుల మరియు మహిళల కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహించారు .ఈ ఎంపికలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 40 మంది పురుషులు మరియు 25 మంది మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి కె.బి. శ్రీరాములు పాల్గొని విద్యార్థులు మంచి క్రమశిక్షణతో నిత్యం ప్రాక్టీస్ చేస్తూ కబడ్డీలో నైపుణ్యాలను పెంచుకుంటూ జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో లో కబడ్డీ అసోసియేషన్ సభ్యులు  రామచంద్రయ్య, ఎస్. విజయ్ కుమార్, టి. కే. రాములు, బాలరాజు, కురుమూర్తి గౌడ్, రాజ వర్ధన్ రెడ్డి, పాపారాయుడు, శ్రీనివాసులు పాల్గొన్నారు