తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న జిల్లా ఎస్.పి. శ్రీ రావిరాల వేంకటేశ్వర్లు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న జిల్లా ఎస్.పి. శ్రీ రావిరాల వేంకటేశ్వర్లు.
దశాబ్దాల పోరాటం, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ, సుసంపన్నం అవుతున్నదని జిల్లా ఎస్.పి. శ్రీ ఆర్.వేంకటేశ్వర్లు గారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభ దినాన ప్రజలందరికీ ఎస్.పి. శుభాకాంక్షలు తెలియజేశారు. మనదైన ప్రత్యేకతను చాటుకోడానికి కలిసికట్టుగా కృషి చేద్దామని, ఈసందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ అనే గురుతర బాధ్యతను నిర్వర్తించేందుకు పోలీసు శాఖ మనసు పెట్టి పని చేస్తుందని ఎస్.పితెలిపారు. కార్యక్రమంలో ఎస్.పి. అడ్మిన్ శ్రీ ఎన్. వేంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ ఎస్.పి. శ్రీ లక్ష్మీనారాయణ, డి.ఎస్.పి.లు శ్రీ జి.శ్రీధర్, శ్రీ ఎం.కిషన్, ఇన్స్పెక్టర్లు, ఎస్.ఐ.లు ఇతర అధికారులు పాల్గొన్నారు