తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చెక్ డాం పనుల గురించి మాట్లాడిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ...

 తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో    చెక్ డాం పనుల గురించి మాట్లాడిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ...

 
ఈ అసెంబ్లీ సమావేశాల ద్వారా తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలుపుతున్నానని...తెలంగాణ లోని వాగుల మీద చెక్ డ్యామ్ లు నిర్మించాలని ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసి చెక్ డ్యామ్ లకు టెండర్లు పిలిపించి వర్క్ లు కూడా పూర్తి అవ్వడం జరిగిందని,దేవరకద్ర నియోజకవర్గంలో రెండు పెద్దవాగులు  ఉన్నాయని,  ఒకటి ఊక చెట్టు వాగు , రెండోది కందూరు పెద్ద వాగు ...గత సంవత్సరం లో కొన్ని చెక్ డ్యామ్ లు మంజూరు అయ్యాయని వారు తెలిపారు.  అందులో 5 చెక్ డ్యామ్ లు పూర్తి చేసుకొని అందులో దాదాపు గా 2 కిలోమీటర్ల మేర నీళ్లు నిలపడం వల్ల రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని..గత సంవత్సరం కొన్ని చెక్ డ్యామ్ లు మిస్ అయ్యాయని ,కోయిల్ సాగర్ నుండి రామన్ పాడ్ వరకు 36 కిలోమీటర్ల ఊక చెట్టు వాగు ఉందని,నిజలపూర్ నుంచి సరళ సాగర్ వరకు కందూర్ వాగు ఉందని, అదే విధంగా రామన్ పాడ్ నుంచి అజ్జకోలు పామపురం వరకు వాగు ఉందని వారు తెలిపారు. లాస్ట్ టైమ్ మిగిలిన పోయిన చెక్ డ్యామ్ లను రెండవ ఫేజ్ లో తీసుకుంటామని ముఖ్యమంత్రి  తెలిపారని , కావున మొదటి ఫేజ్ లో మిగిలిపోయిన చెక్ డ్యామ్ లను రెండవ పేస్ లో తీసుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చి టెండర్లు పిలిపించి పూర్తి చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు తెలిపారు.....దీనికి గానుమంత్రి హరీష్ రావు గారు స్పందిస్తూ....దేవరకద్ర నియోజకవర్గ శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి   చెప్పినటువంటి ఊక చెట్టు వాగు , కందూర్ వాగు మీద మిగిలిపోయినటువంటి చెక్ డ్యామ్ లు ప్రభుత్వ పరిశీలిన లో ఉన్నాయి. ఎమ్మెల్యే చెప్పినట్లు దేవరకద్ర నియోజకవర్గంలో కొన్ని చెక్ డ్యామ్ లు పూర్తి అయి వాటి ఫలాలు కూడా రైతులకు అందుతున్నాయి . నేను ఒక రోజు పేపర్ లో,టివిలో కూడా చూసాను . చెక్ డ్యామ్ మొత్తం నిండి ప్రజలు ఈత కొడుతుంటే ఎమ్మెల్యే  కూడా అందులో దూకి ఈత కొట్టాడని వారు తెలిపారు ...ఈ సందర్భంగా ఎమ్మెల్యే కి అభినందనలు తెలియజేస్తూ మిగిలిన చెక్ డ్యామ్ లను కూడా త్వరలోనే పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని  మంత్రి వర్యులు హరీష్ రావు  తెలిపారు....