తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులను ఆదుకోవడమే లక్ష్యం ...

తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులను  ఆదుకోవడమే లక్ష్యం   ...                            కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి                                  తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులను ఆదుకోవడమే లక్ష్యమని నారాయణపేట  ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు . మంగళవారం   మండలంలో ఉన్న లబ్ధిదారులకు మంజూరు అయిన కల్యాణలక్ష్మి చెక్కులను  నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు అండగా ఉంటుందని తెలియజేశారు. ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా గార్లపాడు గ్రామపంచాయతీ లో ఉన్న సింగిల్ విండో కార్యాలయంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో శశికళ భీంరెడ్డి , జెడ్పిటిసి విజయభాస్కర్ రెడ్డి, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి , సర్పంచులు కృష్ణయ్య, ఆంజనేయులు , కల్పనా బసిరెడ్డి, సుందరమ్మ మోహన్ రెడ్డి, ఎంపిటిసిలు అంజనేయులు, రోజా జగన్ , తాసిల్దార్ ప్రకాష్, ఆర్ఐ కర్ణ య్య, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మల్లయ్య యాదవ్, రాజ వర్ధన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు