తప్పుడు పత్రాలు సృష్టించింది ఒకరు.. కటకటాల్లోకి వెళ్ళింది ముగ్గురు....

తప్పుడు పత్రాలు సృష్టించింది ఒకరు.. కటకటాల్లోకి వెళ్ళింది ముగ్గురు.... 
తప్పుడు పత్రాలు సృష్టించి ఇటు పోలీసు అధికారులను.. అటు మైనింగ్ అధికారులను తప్పుదోవ పట్టించి అక్రమ ఇసుకను మూడు పువ్వులు ఆరు కాయలుగా మలుచుకునేందుకు ఓ వ్యక్తి పన్నాగం పడగా.. వారి వ్యూహాన్ని పోలీసులు చేదించడంతో మరో ఇద్దరు వ్యక్తులు దానికి బలై కటకటాల పాలైన ఈ సంఘటన ఇది.   రాజాపూర్ ఎస్ఐ లెనిన్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం రాజాపూర్ మండలం ఈద్గాన్ పల్లి గ్రామానికి చెందిన దండు వెంకటయ్యకు సంబంధించిన  ఇసుక లారీ ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా వెళ్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.   తదనంతరం జరిమాన విధించాలని మైనింగ్ కార్యాలయానికి తాము ఓ లెటర్ పంపామన్నారు.  తరువాత రోజు వెంకటయ్య రిలీజ్ ఆడర్ తెచ్చి లారీని  పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లాడని వివరించారు .  ఇంతవరకు అంతా బాగానే ఉన్నా.. మరెందుకు స్థానిక పోలీసులకు రిలీజ్ లెటర్ పై అనుమానం వచ్చి ఆ లెటర్ ను మరోసారి  పరిశీలించాలని మైనింగ్ అధికారులకు లెటర్ పెట్టడం జరిగిందన్నారు. మైనింగ్ అధికారులు స్పీడ్ పోస్ట్ ద్వారా ఇది తప్పుడు పత్రం అని చెప్పారని, దానితో పాటు ఒక  కాంప్లెట్ పాంపడం జరిగినట్లు వెల్లడించారు. అప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని.. దండు వెంకటయ్య ను విచారించగా ఆ రిలీజ్ ఆడర్ పక్క గ్రామానికి చెందిన జాటవత్ శంఖర్ తెచ్చి ఇచ్చాడు అని చెప్పాడని పేర్కొన్నారు. ఇదే విసయంలో శంఖర్ ను విచారించగా నా సొంత లాభం కోసం రిలీజ్ లెటర్ ను రాజాపూర్ మండల కేంద్రాలో లక్ష్మన్ జిరాక్స్ సెంటర్లలో ట్యాప్ చేసి తప్పుడు పాత్రని సృష్టించడంతో పాటు  తప్పుడు సంతకం పెట్టి వెంకటయ్య కు ఇచ్చి తప్పును ఒప్పుకున్నట్లు తెలిపారు.   ఇలా తప్పుడు పత్రాలు ఇచ్చినందుకు లారీ ఓనర్ వెంకటయ్య ను, తప్పుడు పత్రం సృష్టించిన జాటవత్ శంఖర్ , జిరాక్స్ సెంటర్ లో తప్పుడు పత్రం ట్యాప్ చేసిన లక్ష్మన్ లకు రాత్రి రిమాండ్ చేయడం జరిగిందని ఎస్ఐ లెనిన్ గౌడ్ మీడియాకు వెల్లడించారు.