తమ దూడలని రక్షించుకోవడానికి చిరుతపై దాడి చేసిన గేదెలు

మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం లో ఉన్న బూరుగుపల్లి సమీపంలో చిరుత పులి సంచరించి అక్కడ ఉన్న గేదెదుడలపై  దాడి చేయడానికి ప్రయత్నించగా, వెంటనే 5 గేదెలు తిరగబడి కొమ్ములతో   చిరుతపులి పై దాడి చేయడంతో చిరుత కు తీవ్రంగా గాయాలయ్యాయని గ్రామస్తులు తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సురేష్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకొని గాయాలైన చిరుతపులిని పరిశీలించి, జిల్లా జూపార్కు తరలిస్తామని వారు తెలిపారు. అంతకు ముందు చిరుతపులి చూడడానికి గ్రామస్తులంతా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది.