తడిసి ముద్దైన వరి ధాన్యం లబోదిబోమంటున్న రైతాంగం ....
తడిసి ముద్దైన వరి ధాన్యం లబోదిబోమంటున్న రైతాంగం ....జడ్చర్ల నియోజకవర్గంలో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం రైతులను తీవ్ర ఇక్కట్ల పాలు చేసింది.ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట చేతికి వచ్చిన సమయంలో వరుణుడు తన ప్రతాపం చూపడంతో రైతులు ఎటు పోని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. జోరుగా వరి కోతలు సాగుతున్న సమయంలో వర్షం కురియడంతో దాన్ని కాపాడుకోవడానికి రైతులు నానా ఇక్కట్లు పడ్డారు. ముఖ్యంగా జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ కు తెచ్చిన వరి ధాన్యం అకాల వర్షం కారణంగా తడిసి ముద్ద కావడంతో రైతులు లబోదిబోమన్నారు. ధాన్యాన్ని తడిసిపోకుండా చూసేందుకు వారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ప్రభుత్వం తమ ధాన్యానికి మద్దతు ధర చెల్లించి ఆదుకోవాలని రైతాంగం విజ్ఞప్తి చేస్తున్నారు.