జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాలైన ఏనుగొండలో సురక్ష పోలీసు కళా బృందం వారి అవగాహన కార్యక్రమం...
జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాలైన ఏనుగొండలో సురక్ష పోలీసు కళా బృందం వారి అవగాహన కార్యక్రమం....రాత్రి కర్ఫ్యూ పాటించాలని, తప్పనిసరి అయితే మాస్కు ధరించి బయటకు రావాలని, భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం వలన కరోనా అంటువ్యాధి విస్తృతిని కట్టడి చేయగలమని వివరించారు. కోవిడ్ నియంత్రణకై ఎంతో ఉపయోగపడే వాక్సిన్ ప్రభుత్వ ఆసుపత్రులలో వేస్తున్నారని, ప్రతిఒక్కరు ఈ వాక్సిన్ వేసుకోవాలని తెలిపారు. కరోనా మహమ్మారి నివారణకు మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా ఎస్.పి. రావిరాల వేంకటేశ్వర్లు గారు తెలిపిన సందేశాన్ని కళా బృందం సభ్యులు పాటలు, మాటల ద్వారా వివరించారు.