సునీల్ నాయక్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి- విద్యార్థి సంఘాల డిమాండ్.....

 సునీల్ నాయక్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి- విద్యార్థి సంఘాల డిమాండ్.....

 మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో శుక్రవారం నాడు పలు విద్యార్థి సంఘాలు సునీల్ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని క్రోవొ తుల ర్యాలీ నిర్వహించారు. పాలమూరు పట్టణ ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్ హక్ మాట్లాడుతూ ,కాకతీయ విశ్వవిద్యాలయంలో సునీల్ నాయక్ ఆత్మహత్య చాలా విషాదకరం అని తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏళ్ళు గడుస్తున్న ఇప్పటికీ ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిన హామీ ఇంకా నెరవేరకపోవడంతో చాలా బాధాకరమని యువతకు ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్న పట్టించుకోని దీనస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని పలు విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి.  విద్యార్థి సంఘాలు ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు నోటిఫికేషన్ లేక యువత పెడదారి పడుతున్నారని ప్రభుత్వం కూడా చదువుకున్న విద్యార్థుల పై ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు అనే విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.