సునీల్ మృతికి టిఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి బిజెపి మండల పార్టీ అధ్యక్షులు కావలి రామకృష్ణ....

 ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలి 

సునీల్ మృతికి టిఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి బిజెపి మండల పార్టీ అధ్యక్షులు కావలి రామకృష్ణ....నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడంలేదని పురుగుల మందు సేవించి మరణించిన బోడ సునీల్  కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని రాజాపూర్ బిజెపి పార్టీ మండల అధ్యక్షులు కావలి రామకృష్ణ డిమాండ్ చేశారు . శుక్రవారం రాజాపూర్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు కావాలి రామకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనకు నోటిఫికేషన్ విడుదలచేసి నిరుద్యోగ యువకులను ఆదుకోవాలని కావలి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ల భర్తీ కోసం బిజెపి పార్టీ తరఫున పోరాటాలు చేసి సాధిస్తామని కానీ నిరుద్యోగ యువకులు మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడవద్దని రాజాపూర్ బిజెపి పార్టీ మండల అధ్యక్షులు కావలి రామకృష్ణ పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలకు పాల్పడిన కన్నతల్లిదండ్రులకు కడుపుకోత బాధపెట్టొదనీ ఆయన కోరారు.  రాష్ట్రప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేసి నిరుద్యోగ యువకులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల నిరుద్యోగుల చేతనే నీపతనం ప్రారంభమవుతుందని ఆయన హెచ్చరించారు. నిరుద్యోగ యువకుల్లారా ఇప్పటికైనా మేల్కొని కెసిఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే విధంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.