స్థానిక సంస్థల వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ థేయం .... పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ...

స్థానిక సంస్థల వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమనిరాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేస్ కుమార్ హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల  అదనపు కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన  వీడియో కాన్ఫరెన్స్ కు మంత్రి వరంగల్ నుంచి హాజరయ్యారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానిక సంస్థలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇందులో భాగంగా మున్సిపల్ పట్టణ ప్రాంతాలు, గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ, హరితహారం, సీజనల్ వ్యాధుల ను ఎదుర్కొనే అంశాలపై ప్రత్యేక దృష్టి నిలపాలని కలెక్టర్లతో కోరారు.హరితహారం కార్యక్రమం కింద గ్రామం, మండలం, జిల్లా వారీగా ప్రణాళిక రూపొందించాలని, మొక్కలు నాటడం తో పాటు, నర్సరీల పై కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని , రహదారులకు ఇరువైపులా పెద్ద మొక్కలను నాటాలని చెప్పారు.హరితహారం కింద నాటిన మొక్కల కు తప్పనిసరిగా కంచె ఏర్పాటు చేయాలని అన్నారు. మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి నిలపాలి,పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉండడంతో పాటు, వర్షాకాలం ప్రారంభమైన సీజనల్ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉందని,ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, అన్నారు.
ఇదివరకే అన్ని జిల్లాలలో వైకుంఠ దామాలను నిర్మించడం జరిగిందని ,వీటిని వాడకం లోకి తీసుకు రావాలని చెప్పారు.అన్ని గ్రామాలలో తప్పనిసరిగా  నిరంతరం గ్రామ సభలు నిర్వహించాలని, ఈ గ్రామ సభలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, పంచాయతీ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.  అదేవిధంగా గ్రామాలలో రాత్రి బస చేసి ఉదయమే గ్రామాల్లో పర్యటించి స్థానికంగా ఉండే సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. సెక్రటరీలు, రాష్ట్ర స్థాయి అధికారులు,మంత్రులు గ్రామాలలో ఆకస్మిక తనిఖీ చేయడం జరుగుతుందని, పారిశుధ్య నిర్వహణ పై నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.