శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి ఆలయ అభివృద్ధికి తోడ్పాటును అందించాలి...స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి..

 శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి ఆలయ అభివృద్ధికి తోడ్పాటును అందించాలి...
నూతనంగా ఎన్నికైన పాలకమండలి సభ్యులు చైర్మన్ ప్రమాణస్వీకారోత్సవం
చైర్మన్ ప్రతాప్ రెడ్డి ని శాలువాతో సన్మానించడం ఎమ్మెల్యే ఆల 
కురుమూర్తి స్వామి రాజగోపురా నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఆల
గుట్టపైకి మట్టి రోడ్లు వేసిన రైతులను శాలువాతో సన్మానించిన ఎమ్మెల్యే ఆల
స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి. శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థాన అభివృద్ధి కోసం నూతనంగా ఎన్నికైన పాలకమండలి సభ్యులు చైర్మన్ ప్రతాప్ రెడ్డి తమ తోడ్పాటును అందించాలని దేవరకద్ర నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో కాంచన గుహలో కొలువుదీరిన శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థాన పాలక మండలి చైర్మన్ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డిలు హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కురుమూర్తి స్వామి దేవస్థానం ఆలయ కమిటీ పాలక మండలి కమిటీ సభ్యులను చైర్మన్ ఎన్నుకోవడం శుభసూచికం అన్నారు. నూతనంగా ఎన్నుకొన్న పాలకమండలి సభ్యులు చైర్మన్ ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు అందించి స్వామి దేవస్థానం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని వారు అన్నారు. ఈ పాలక మండలి సభ్యుల అదృష్టం ఏమిటంటే వాళ్లు ప్రమాణ స్వీకారం చేసే సరికి రాజగోపురం నిర్మాణం పనులు పూర్తవుతున్నాయి చిన్నచింతకుంట మండలం నుంచి కురుమూర్తి స్వామి టెంపుల్ వరకు ఒక చెట్టు వాగులో బ్రిడ్జి నిర్మాణానికి రెండు కలిపి 41 కోట్ల రూపాయలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి మంజూరు చేయడం జరిగిందన్నారు. దీనికి టెండర్లు పూర్తయిందని కాంట్రాక్టర్లు ముందుకు వస్తే పని ప్రారంభించడం జరుగుతుంది అని ఆయన అన్నారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధి కోసం దాతలు ముందుకు వచ్చి విరాళం ఇవ్వడం కూడా జరుగుతుందని వాటి ద్వారా కూడా అభివృద్ధి జరుగుతుందని దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహాయం మే కాకుండా నూతన పాలక మండలి సభ్యులు చైర్మన్ వారు సొంతంగా అహర్నిశలు కృషి చేసి దేవాలయ అభివృద్ధికి మరింత కృషి చేయాలని అన్నారు. అప్పుడే ఆలయ అభివృద్ధి మరింత అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు. ముఖ్యంగా దాతల సహకారంతో ముఖ్యంగా దాతల సహకారంతో కోనేరు మంచిగా నిర్మించుకోవడం జరిగిందన్నారు. ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో రూములు నిర్మించడానికి దాతలు వచ్చారని వాటిని త్వరగా పనులు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. కురుమూర్తి స్వామి  ఎంతో మహిమ గల దేవుడు అని అనేక రాష్ట్రాలలో మండలాల భక్తులు కొలుస్తున్నారు అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం నేను నా వంతు బాధ్యతగా అభివృద్ధి కోసం కృషి   చేస్తానన్నారు. కురుమూర్తి స్వామి గుట్ట పైకి మట్టి రోడ్లు వేసిన రైతులను శాలువాతో సన్మానించడం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. అదేవిధంగా కురుమూర్తి స్వామి గర్భ గుడిలో నూతనంగా ఎన్నికైన పాలకమండలి సభ్యులు చైర్మన్ ప్రతాప్ రెడ్డిని , కమిటీ సభ్యులు ఎం శ్రీనివాస్ రెడ్డి గోపి స్వామి ఎన్ శంకర్ ఏం నాగరాజు  శంకర్  శ్రీధర్ రెడ్డి అనిల్ గౌడ్ రాజగోపాల్ రెడ్డి  మురళి రెడ్డి నాగరాజు శేఖర్ రెడ్డి కృష్ణవేణి శ్రీనివాస్ గౌడ్ మొత్తం పాలకమండలి కమిటీ సభ్యులు 13 మంది కమిటీ చైర్మన్ తో 14 మందిని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ వెంకటేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించారు.  గుట్ట కింది భాగంలోరాజగోపురనిర్మాణంపనులనువారుపరిశీలించారు.ఈసందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలక మండలి నూతన కమిటీ ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ. నాపై అభిమానంతో నాకు ఈ చైర్మన్ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. అదేవిధంగా కురుమూర్తి స్వామి కి సేవచేసే భాగ్యం దక్కినందుకు కురుమూర్తి స్వామి కి ఆలయ అభివృద్ధికి నా తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందని అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోట రాములు, జెడ్పిటిసి రాజేశ్వరి రాము, గ్రామ సర్పంచ్ సులోచన సత్యనారాయణ గౌడ్, సింగిల్విండో అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ జిల్లా సభ్యులు  కరుణాకర్ రెడ్డి,