శ్రీరామ కొండ అభివృద్ధి మా లక్ష్యం ... భక్తులకు పులిహోర అంబలి ప్యాకెట్లు పంపిణీ చేసిన ...... నవోదయ హాస్పిటల్ ఎండి రవీందర్ రెడ్డి

 శ్రీరామ కొండ  అభివృద్ధి మా లక్ష్యం   ...      భక్తులకు పులిహోర అంబలి ప్యాకెట్లు పంపిణీ చేసిన     ......  నవోదయ హాస్పిటల్ ఎండి రవీందర్ రెడ్డి        కోయిలకొండలో  ఆదివారం అమావాస్య రోజు సందర్భంగా, మండలం లో ఉన్న శ్రీరామ కొండ  క్షేత్రంపై వెలసిన శ్రీ రామ పాదాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు పులిహోర ప్యాకెట్, అంబలి, వాటర్ ప్యాకెట్లు నవోదయ హాస్పిటల్, విద్యాసంస్థల చైర్మన్, నారాయణపేట  ఎమ్మెల్యే ఎస్ . రాజేందర్ రెడ్డి సహకారంతో నవోదయ విద్యాసంస్థల ఎండి రవీందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవాలయాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యమని ఆయన తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి  భక్తులకు క్షేత్రము దిగువ నుంచి శ్రీరాముని గర్భగుడి వరకు రోడ్డు వేయడం ద్వారానే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్రీరామ పాదాన్ని దర్శించుకోవడానికి అవకాశం కలిగిందని తెలియజేశారు. ప్రతి ఏటా ఆదివారం అమావాస్య రోజు జరిగే జాతర సందర్భంగా భక్తులకు నవోదయ విద్యా సంస్థల తరపున అన్ని వసతులు కల్పించడం జరిగిందని సూచించారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలోని కోయిలకొండ మండలం లో ఉన్న శ్రీరాముని దేవాలయం భద్రాచలం గా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. శ్రీరామనవమి రోజున భద్రాచలం లో పూజలు ఏవిధంగా జరుగుతాయో ఇక్కడ కూడా వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.