గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలి... స్పెషల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

 గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలి... స్పెషల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

 

కోయిలకొండ  న్యూస్: గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కరూ నాటిన మొక్కపెరుగుదలకు కృషి చేసినప్పుడే పచ్చదనంతో గ్రామాలు కళకళలాడుతాయి అని మహబూబ్నగర్ జిల్లా  స్పెషల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. శనివారం మండలంలో ఉన్న  ankilla , అయ్యవారిపల్లి , గార్లపాడు, ద మాయ పల్లి లో ఉన్న నర్సరీలను, పల్లె పకృతి వనంలో ఉన్న మొక్కలను, స్మశాన వాటిక లను స్పెషల్ కలెక్టర్ పరిశీలించారు. మండలంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు వెంటనే పూర్తిచేయాలని స్పెషల్ కలెక్టర్ కోరారు. గ్రామాలలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని సూచించారు. అదేవిధంగా అయ్యవారి పల్లి సర్పంచ్ విజయశ్రీ సురేష్ తన సొంత పొలంలో నాటిన   పామాయిల్  మొక్కలను స్పెషల్ కలెక్టర్ పరిశీలించారు. పామాయిల్ మొక్కల పెరుగుదలకు కృషి చేస్తున్నందుకు సర్పంచ్ ని స్పెషల్ కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎం పీ ఓ మహమ్మద్  హైమద్, పి ఆర్ ఏ ఈ ఇసాక్ , పంచాయతీ కార్యదర్శులు శ్రీధర్ రెడ్డి, సురేష్ చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.