ఎన్ డి ఏ కు మహబూబ్ నగర్ విద్యార్థి ఎంపిక ....
ఎన్ డి ఏ కు మహబూబ్ నగర్ విద్యార్థి ఎంపిక ....
2021 మార్చి 6న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యూఢిల్లీ ఎన్.డి.ఎ ఫలితాలలో మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన బైరెడ్డి సంజయ్ రెడ్డి జాతీయ స్థాయిలో పదకొండవ ర్యాంకు దక్షిణ భారతదేశంలో మొదటి ర్యాంకు సాధించాడు. ఏప్రిల్ 1 నుండి పూణేలోని కాడికి వార్ల లో మూడు సంవత్సరాల పాటు బీటెక్ చేయించి అనంతరం ఒక సంవత్సరం పాటు నేవి అధికారిగా శిక్షణ ఇచ్చి పూర్తి స్థాయి అధికారిగా నియామకం చేస్తారు. సంజయ్ రెడ్డి ఐదవ తరగతి వరకు మహబూబ్నగర్లోని రెయిన్బో పాఠశాలలో, 6 నుండి 8వ తరగతి వరకు హైదరాబాదులో ,తొమ్మిదవ తరగతిలో సైనిక్ స్కూలు కొరకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించి కోరుకొండ సైనిక పాఠశాలలో చేరారు. సైనిక్ పాఠశాలలో విద్యార్థిగా ఎన్నో కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని హౌస్ కెప్టెన్గా కూడా ఎన్నికయ్యాడు, 2020 లో బెస్ట్ క్యాడెట్ గా ఎంపికై అధికారుల చేతులమీదుగా ట్రోఫీ అందుకున్నాడు.ఫలించిన తల్లిదండ్రుల ఆశయం మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు అయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గాయత్రి దేవి గార్ల కుమారుడు సంజయ్ రెడ్డి. తమ కుమారుడు రక్షణ శాఖలో చేరి భారత దేశానికి సేవ చేయాలని వారు ఆశించారు. వాళ్ళ ఆశయాలను సార్థకత చేస్తూ సంజయ్ రెడ్డి భారత రక్షణ శాఖ లోని త్రివిధ లా లా దళాల భాగాలకు యుపిఎస్సి వారు 2020 సెప్టెంబర్ లో రాత పరీక్ష అనంతరం ఇంటర్వ్యూ చివరికి మెడికల్ పరీక్షలు నిర్వహించారు. అన్నింటిలోనూ ప్రతిభ కనబరిచిన సంజయ్ రెడ్డి నావల్ అకాడమీ ఎంపిక అయినాడు .అతని ఎంపిక పట్ల ఆయన తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు .మేము కన్నా కలలు సంజయ్ పూర్తి చేశాడని వారు అన్నారు .ఎన్ డి ఏ కు ఎంపిక అయిన సంజయ్ రెడ్డిని తపస్ జిల్లా అధ్యక్షులు వి కర్ణాకర్ గౌడ్ అభినందనలు తెలియజేశారు.