స్కానింగుకు ప్రైవేట్ డయగ్నిస్టిక్ కేంద్రాలకు పంపిస్తే కఠిన చర్యలు...మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్....
స్కానింగుకు ప్రైవేట్ డయగ్నిస్టిక్ కేంద్రాలకు పంపిస్తే కఠిన చర్యలు.... తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ ఆస్పత్రులను ఏర్పాటు చేసిందని, అంతేకాక అధునాతన పరికరాలతో తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రం ఏర్పాటు చేసిందని, అయినప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు స్కానింగ్ నిమిత్తం, పరీక్షల నిమిత్తం ప్రైవేటు కేంద్రాలకు వెల్లమనడం మంచిదికాదని అన్నారు. ఒకవేళ ఎవరైనా ఆ విధంగా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం మంత్రి మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 200 ఆక్సిజన్ పడకల ప్రారంభోత్సవం సందర్భంగా ఆస్పత్రికి వచ్చిన పలువురు మహిళలతో మాట్లాడగా డాక్టర్లు స్కానింగ్, ఇతర పరీక్షల నిమిత్తం తమను ప్రైవేటు కేంద్రాలకు వెల్లమంటున్నారని మంత్రికి ఫిర్యాదు చేయగా మంత్రి పైవిధంగా స్పందించారు. ఆస్పత్రి ల్యాబ్ ఇంచార్జ్ ను,డాక్టర్లను పిలిపించి మాట్లాడగా రేడియాలజిస్ట్ ఒకరు ఉన్నందున గర్భిణీ స్త్రీల కు 5 వ నెలలో నిర్వహించే టిఫా స్కాన్ కు సమయం తీసుకుంటున్నందున ప్రైవేట్ కేంద్రాలకు రాస్తున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రిలోనే అన్ని పరీక్షలు నిర్వహించాలని ,ఒకవేళ ఏదైనా పరీక్షల నిర్వహణకు ఆలస్యం అయ్యేలా ఉంటే రోగులకు తెలియజేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,మున్సిపల్ చైర్మన్ కె.సి నర్సింహులు,ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ రాం కిషన్,ఆసుపత్రి సలహా కమిటీ సభ్యులు లక్ష్మీ, తదితరులు ఉన్నారు.