సారా విక్రయించిన మహిళను జైలుకు తరలించిన ఎక్సైజ్ శాఖ అధికారులు.....
సారా విక్రయించిన మహిళను జైలుకు తరలించిన ఎక్సైజ్ శాఖ అధికారులు.....
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలోని వేముల తండా కు చెందిన జర్పుల మంగమ్మ ను అరెస్టు చేసి జిల్లా జైలుకు తరలించారు. సిఐ బాలాజీ మాట్లాడుతూ గతంలో సారా విక్రయించి గా ఎమ్మార్వో ఎదుట బైండోవర్ చేయడం జరిగిందని , ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తిరిగి సారా విక్రయించడం వల్ల ఆమె పై కేసు నమోదు చేయగా లక్ష రూపాయల జరిమానా లేదా సంవత్సరం జైలు శిక్ష విధించడం జరిగిందని జరిమానా చెల్లిస్తే జైలు శిక్ష రద్దు అవుతుందని తెలిపిన చెల్లించకపోవడంతో జైలుకు పంపడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సి ఐ తోపాటు ఆర్ ఎస్ ఐ హెడ్ కానిస్టేబుల్ హౌస్ కానిస్టేబుల్ సిద్ధార్థ జ్యోతి పాల్గొన్నారు