సామ్రాట్ అశోక 2325వ జయంతి ....
సామ్రాట్ అశోక 2325వ జయంతి ....సామ్రాట్ అశోక 2325వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం బాలానగర్ మండలం కేంద్రంలోని దళిత ఐక్య వేదిక కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అశోక చక్రవర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామ్రాట్ అశోక చక్రవర్తి పరిపాలనను స్వర్ణ యుగంగా కొనియాడారు. వారు చేసిన సేవలను, వారి పరిపాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా జీవించారాని, తన 40 సంవత్సరాలలో 25 సార్లు ఖైదీలను వదిలి పెట్టి వారిని జన జీవనంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారని గుర్తుచేశారు. అఖిరికి జైలను మొత్తం బంద్ చేసిన ఘనుడు, తాను యుద్ధలను వాది బౌద్ధ మతాన్ని స్వికరించి పరిపాలన కొనసాగించారని తెలియజేశారు. ఈకార్యక్రమంలో అరెళ్ల యాదయ్య, పెర్మళ్ళ జంగయ్య, రాములు, వెంకటేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.