రోడు ప్రమాదంలో వ్యక్తి మృతి మరొకరికి తీవ్ర గాయాలు ....
రోడు ప్రమాదంలో వ్యక్తి మృతి మరొకరికి తీవ్ర గాయాలు ....
మిడ్జిల్ మండల పరిధిలోని కొత్తపల్లి దగ్గర మంగళవారం అందాజ రాత్రి 11 గంటల మధ్య మిడ్జిల్ నుండి జడ్చర్ల కు వెళుతున్న కారు రోడ్డు క్రాస్ చేస్తున్న బైకును అతివేగంతో ఉన్న కారు ఢీకొట్టడంతో మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన కమ్మరి ఆనంద్ చారి అక్కడికక్కడే మృతి చెందాడు బైక్ పై కూర్చున్న వ్యక్తి గంగాధర్ కు తీవ్ర గాయాల పాలయ్యాడు గంగాధర్ ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు సంఘటనపై కేసు నమోదు చేసి ఇ దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ మన్ మోహన్ గౌడ్ తెలిపారు మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆనంద్ మృతిని తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రభుత్వ పరంగా వచ్చే ఇన్సూరెన్స్ త్వరలో వచ్చేటట్లు గా చేస్తానని లక్ష్మా రెడ్డి హామీ ఇచ్చారు అనంతరం దాన సంస్కారాలకు పదివేల రూపాయలను ఆర్థిక సాయం కుటుంబ సభ్యులకు అందజేశారు మృతుని కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అండ దండగా ఉంటుందని పార్టీ కార్యకర్తలను ఆదుకుంటుందని కుటుంబానికి ధైర్యం ఇచ్చారు